మెట్ పల్లి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 10 :
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు ఓంకార్ సుబ్బరాజు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… మెట్ పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ సుబ్బరాజు జగిత్యాలలో హోంగార్డు గా విధులు నిర్వస్తున్నాడు. గురువారం విధులకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో నిజామాబాద్ డిపోకు చెందిన టీఎస్ 16 యుసి 9963 ఆర్టీసీ బస్సు మెట్ పల్లి పట్టణ శివారులో హోంగార్డు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో హోంగార్డు సుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య , ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.