మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
పట్టణంలోని 23వ వార్డులో కోరే లస్మయ్య ఇంట్లో గత 30 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న పుల్లూరి నర్సును 30 ఏళ్ల నుండి ఇంటి యజమాని ఆ వృద్ధురాలి బాగోగులు చూసు కునే వారు. కాగా బుధవారం పట్టణానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎర్రోళ్ల హన్మాండ్లు పుల్లూరి నర్సు కొడలితో మాట్లాడి ఆ వృద్ధురాలిని తన కొడలి వద్ద ఉండడానికి ఏర్పాటు చేశాడు. అనంతరం వృద్ధురాలిని ఆటోలో వృద్ధురాలిని కొడలి ఇంటికి తీసుకువెళ్లి ఇంట్లో ఉంచడం జరిగింది.అనంతరం ఆ వృద్ధురాలితో మాట్లాడి తనకు ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని ఎర్రోళ్ల హన్మాండ్లు వృద్ధురాలికి తెలిపాడు.