- 4 నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం
జగిత్యాల ప్రతినిధి ,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జిల్లాలో నకిలీ దొంగనోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. దొంగనోట్ల ముఠా సభ్యులలో నలుగురు పోలీసులా అదుపులో ఉన్నట్టు సమాచారం. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దొంగనోట్ల ముఠా సభ్యులలో నలుగురు ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన వారిగా సమాచారం. ఈ దొంగనోట్ల ముఠాకు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దొంగనోట్ల ముఠా సభ్యుల నుండి 15 లక్షలు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.