Rr News Telangana
క్రైమ్మెట్ పల్లి

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

  • వారి వద్ద నుండి బంగారం, వెండి, ఒక స్కూటీ, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను బుధవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 12న 2 గంటల సమయంలో ప్రియదర్శిని కాలనీలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి బంగారు ఆభరణాలు చోరి చేసారని సమాచారం రావడంతో మెట్ పల్లి డీఎస్పి ఉమా మహేశ్వర రావు సూచనల మేరకు మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి, మెట్ పల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలిస్తు ఉండగా బుధవారం మెట్పల్లి పాత బస్ స్టాండ్ వద్ద ఇద్దరు నిందితులు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. నింధితుల వివరాలు… శ్రీ రామ్ శివ, బీడీ వర్కర్స్ కాలనీ చెందిన వారని,మరో నిందితుడు కట్ట మల్లేష్ బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శ్రీ రామ్ శివ గతంలో ఇబ్రహీంపట్నం శివార్లలో ఓ మహిళను బెదిరించి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు దోచుకున్నాడని తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక జత ఇయర్ రింగ్స్ మరియు సాకేట్ గుండ్లు, ఒక బంగారు గొలుసు మరియు ఆర్ చిహ్నాన్ని కలిగి ఉన్న లాకెట్, వెండి పట్టా గొలుసులు, బంగారు నల్ల పూసల తాడు, గోల్డ్ ఇయర్ రింగ్స్ మొత్తం 52.1 గ్రాముల బంగారం మరియు 55 గ్రాముల వెండి దాని విలువ 3,70,000/-, యాక్టివ్ స్కూటీ, ఒక మొబైల్ దాని విలువ 30,000/- మొత్తం 4,00,000/- స్వాధీన పరుచుకున్నారని మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా
డిఎస్పి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇకనుండి ఎవరైనా దొంగతనం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే వెంటనే వారి పూర్తి వివరాలు పోలీస్ లకు చేరుతాయని, ప్రతి గ్రామంలో మరియు రోడ్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా నేరస్తుల వివరాలు క్లుప్తంగా బయటపడతాయని, కొత్త చట్టాలు అమలులో ఉన్నాయని, కొత్త చట్టాల ద్వారా నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, శిక్షలు కూడా కఠినంగా ఉంటాయని అన్నారు.. గత సంవత్సరంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన దొంగతనంలో మరియు ఈ నెలలో మెట్ పల్లిలో జరిగిన దొంగతనంలో పాల్పడిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పట్టుకొని రిమాండ్ కు తరలిస్తున్నామని అన్నారు. దొంగలను చాక చక్యంగా వల పన్ని సమాచారం సేకరించిన సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై చిరంజీవి మరియు పీసీలు కిరణ్, సంతోష్ లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డితో పాటు, ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బిఆర్ఎస్ కు భారీ షాక్

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పై డిఎస్పి విచారణ

అత్యాచారం కేసులో నిందితులకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group