జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల పట్టణంలోని శివాజీవాడకు చెందిన దాడి రామవ్వ అనే మహిళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి అయిన ఓ జర్నలిస్ట్ కు శనివారం ఫోన్ చేసి నాపైన కేసు పెట్టిస్తావ అంటూ చెప్పుకోలేని విధంగా భూతులు తిట్టడంతో ఆ జర్నలిస్ట్ మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతో పాటు ఆడియో రికార్డు కూడా వినిపించాడు. దీంతో పోలీసులు రామవ్వకు ఫోన్ చేసి స్టేషన్ కు రమ్మని తెలుపగ ఆమె ఫోన్ కట్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దాడి రామవ్వపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.