- యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా మంగళవారం స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యవత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్షలను సాధించాలన్నారు. మత్తు పదార్థాలకు మానసికగా బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉంది అని అన్నారు. అనుకోకుండా ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. కావున డ్రగ్స్,గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాల ను సాదంచాలనీ సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించిన సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ప్రస్తుత రోజుల్లో అనేక సైబర్ మోసాలు బాగా పెరిగాయి వీటి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ఆశ్రయించాలి అన్నారు. జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. డ్రగ్స్ నివారణలో యువత యొక్క పాత్ర పై ఎస్పీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థిని, విద్యార్థులకు ఎస్పీ బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.