- ఫిర్యాదు చేసి నెల గడుస్తున్నా చర్యలు శూన్యం
- పోలీసులు న్యాయం చేయడం లేదని బాధితుడి ఆవేదన
జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా చెర్లపల్లి గ్రామానికి చెందిన డిటీ రాజన్న అనే వ్యక్తిని జగిత్యాల పట్టణానికి చెందిన నలువాల నాగరాజు అనే ఏజెంట్ ఎలాంటి లైసెన్స్ లేకుండా ఏజెంట్ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డిటి రాజన్న అనే వ్యక్తిని 2 సంవత్సరాల అక్రిమెంట్ అని చెప్పి కత్తర్ పంపించాడు. కత్తర్ కు వెళ్లిన డిటి రాజన్నను రెండు రోజులకే ఇండియాకు పంపించడంతో ఇండియాకు తిరిగి వచ్చిన రాజన్న ఏజెంట్ నాగరాజును నిలదీయడంతో మరో దేశం పంపిస్తానని లేదా మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తానని తెలిపాడని. ఇప్పుడు నేను నిన్ను ఏ దేశం కూడా పంపించను, నీకు డబ్బులు కూడా తిరిగి ఇవ్వనని నీకు దిక్కున్న చోట చెప్పుకోమని అనడంతో…రాజన్న జగిత్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెల గడుస్తున్నా ఇప్పటి వరకు ఏజెంట్ పై చర్యలు తీసుకోవడం లేదని డిటి రాజన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నారు.