మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
పసికందును మురికి కాలువలో పడవేసిన ఘటన మెట్ పల్లిలో చోటుచేసుకుంది. మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియం సమీపంలో ఉన్న మురికి కాలువలో పసికందు మృతదేహం కొట్టుకువచ్చింది. ఆ పసికందు మృతదేహన్ని అవాంఛిత గర్భంతోనే మురికి కాలువలో పడేసినట్లు తెలుస్తోంది.పసికందు మృతదేహాన్ని పడేసిన మురికి కాలువ ప్రధాన మురికి కాలువ కావడంతో ఎక్కడి నుండైన నీటి ప్రవాహానికి కొట్టుకువచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.