- అందులో ఒకరు ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెట్ పల్లి పోలీసులు 8 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదివారం మెట్ పల్లి పోలీసులు ఓ దొంగను పట్టుకొని విచారించగా నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లాకు కు చెందిన 5 గురితో పాటు ఆర్మూర్ కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు నేను ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అని ఏమైనా ఉంటే పక్కకు వెళ్లి మాట్లాడు కుందామని పోలీసులతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం. మెట్ పల్లి పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తు న్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ను ఆ కేసును నుండి బయటకు తీసుకురావడానికి కొంతమంది రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు ఓ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి వైస్ చైర్మన్ పై కేసు పెట్టకూడదని చెప్పినట్లు సమాచారం. ఇలాంటి దొంగలకు రాజకీయ నాయకులు అండగా ఉండడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 8 మంది పై పోలీసులు కేసులు నమోదు చేస్తారో లేదా వారితో బేరం కుదుర్చుకొని వదిలేస్తారో చూడాలి మరి….?