Rr News Telangana
జగిత్యాల

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం

  • పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి
  • జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ : 

జిల్లాలో స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కు పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు.ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లాకు వచ్చిన పోలీస్ అధికారులు,సిబ్బందితో శనివారం జిల్లా కేంద్రంలో పద్మనా యక ఫంక్షన్ హాల్లో బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఎన్నికల విధులకు వచ్చిన సెంట్రల్ ఆర్మూడ్ ఫోర్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్ని కల ప్రాముఖ్యతను వివరిస్తూ, ఎన్నికల విధులు ఏవిధంగా పకడ్బందీగా నిర్వహించాలి అని, సిబ్బంది చేయవలసిన, చేయకూడాని విధుల గురించి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ, పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లరాదన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారితో మర్యాదపూర్వ కంగా ఉండాలని, అనవసర విషయాలు చర్చించ వద్దన్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించా లన్నారు. ఓటర్లు ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ లు, మందు గుండు సామాగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పోలింగ్ బూతు లోనికి తీసుకువెళ్లారాదని, సెల్ఫీలు దిగడం నిషేదం అన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఉన్నతాధి కారాలు ఆదేశాలు లేనిదే ఎవ్వరూ కూడా తమ విధులనుండి వెళ్లరా దన్నారు.ఎవరైనా చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. భారత ఎన్ని కల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగటానికి ఆస్కారం ఉన్న వెంటనే సంబంధిత యస్.హెచ్.ఒ. లకు, రూట్ మొబైలు అధికారికి సమాచారం అంధించాలన్నారు. ఎట్టి పరిస్తుతుల్లోనూ పోలింగ్ అధికారి అనుమతి లేనిది పోలింగ్ స్టేషన్ లోనికి వెళ్లారాదని సూచిం చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు వినోద్ కుమార్, భీం రావ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డిఎస్పీలు రవీంద్ర కుమార్,రఘు చందర్, ఉమామహేశ్వర రావు,రంగా రెడ్డి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నాగేశ్వర రావు, వేణుగోపాల్, ఆరిఫ్ అలీ ఖాన్ , రవి , రామ్ నరసింహారెడ్డి,సురేష్,నవీన్ , ఆర్.ఐ లు వేణు ,రామకృష్ణ ,జనిమియా మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అసాంఘిక కార్యకలాపాలను,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే నాక బంధీ కార్యక్రమం

Rr News Telangana

గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు

Rr News Telangana

అత్యాచారం కేసులో నిందితులకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group