మెట్ పల్లి మే 09, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి టీ జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ మెట్ ప ల్లి పట్టణంలోని కోర్టు ప్రాంతంలో గురువారం ఆరే ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శాకీర్ మాట్లాడుతూ దేశంలో సుస్థిరంగా ప్రభుత్వాన్ని అందించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణాలను త్యాగం చేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే నిరుపేద కుటుంబాలకు ఇండ్ల పట్టాలను అందించనున్నట్లు తెలిపారు. అనంతరం వార్డులో తిరుగుతూ టీ. జీవన్ రెడ్డికి భారీగా ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమం లో ఆరేళ్ల సువర్ణ, ఆరేళ్ల శాంతి, ఆరేళ్ల శోభ, ఆరేళ్ల యశోద లతోపాటు పార్టీ కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.