Rr News Telangana
మెట్ పల్లి

కాళ్లు మొక్కుతూ.. ఓట్లు అడుగుతూ

మెట్ పల్లి , మే 9, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ : 

మెట్ పల్లి పట్టణంలో బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు కొయ్యల లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు బొడ్ల ఆనంద్, బీజేవైఎం సీనియర్ నాయకులు సుంకేట విజయ్ ఆధ్వర్యంలో పాదాభివందనం చేపట్టారు. మెట్ పల్లి బూత్ నెంబర్ 217, 26 వ వార్డులో నరేంద్ర మోడీ గెలుపు కోసం కాళ్ళు మొక్కి, విస్తృత స్థాయి ప్రచారంలో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నికల్లో ఓటర్ల చేతిలో మేనిఫెస్టో పెట్టి లేదా నమూనా బ్యాలెట్ పెట్టి ఓట్లు అడగడం ఓ స్టైల్, ఆడవారయితే బొట్టు పెట్టి ఓటు వేయాలని అభ్యర్థిస్తారు. కానీ బీజేపీ పార్టీ తరపున బీజేపీ  నేతలు కాళ్లు మొక్కి మరీ ఓట్లు అడుగుతున్నారు. ఇటీవల ధర్మపురి అరవింద్ ప్రతి ఓటరుని వ్యక్తిగతంగా కలవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ నేతలు వ్యక్తిగతంగా కలుస్తూ ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

పాదాభివందనం…

ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం అనే కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నేతలు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లడం ఓటర్ల కాళ్లు మొక్కడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వేడుకోవడం, ఓటు వేస్తామంటూ హామీ ఇచ్చాకే కాళ్లపైనుంచి లేవడం.. ఇలా చేస్తున్నారు బీజేపీ నేతలు. మెట్ పల్లి పట్టణంలో బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు కొయ్యల లక్ష్మణ్ బూత్ అధ్యక్షులు బొడ్ల ఆనంద్ ,  బీజేవైఎం సీనియర్ నాయకులు సుంకేట విజయ్ ఆధ్వర్యంలో ఈ పాదాభివందనం చేపట్టారు. నాయకుల కార్యకర్తల బృందం ఇలా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు పాదాభివందనం చేయడం మెట్ పల్లి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Related posts

పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలి

Rr News Telangana

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Rr News Telangana

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group