* బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన దంపతులు
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అతడి కుమారుడు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కు జెడ్పిటిసి నుంచి సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచే వరకు మేము మా కుటుంబం రాత్రి పగలు కష్టపడి మీ విజయానికి కృషి చేశాము. మేము ఎంత కష్టపడ్డా కానీ మాకు తగిన గుర్తింపు లేకపోవడం వల్ల కనీస సమాచారం ఇవ్వకుండా మండలంలో పర్యటిస్తూ మాకు సమాచారం తెలుపకుండా మీకోసం కష్టపడ్డ మాలాంటి కుటుంబాలకు తీరని నష్టం కలిగించారు. మీ కన్నా ముందు రాజకీయాల్లో వెల్ముల పుష్పలత దేవి సుగుణాకర్ రావు అనే మేము మండల ప్రెసిడెంట్ గా మూడుసార్లు ఎంపీటీసీగా ఒకసారి సిడిసి చైర్మన్ గా ఒకసారి జడ్పిటిసి గా పోటీ చేసి ఓడిపోయాం మేము రాజకీయాల్లో ఉంటూ ఇంకొకరికి శ్రేయస్సు కోరుకుంటు ఇంకొకరి ఎదుగుదలకు కృషి చేశాము కానీ మీలాగా మీ రాజకీయ అవసరాల కోసం మమ్ములను వాడుకున్నారు. ప్రతిసారి కుటుంబం కుటుంబం అనుకుంటూ మా కుమారుడు వెల్ముల శ్రీనివాస రావును కూడా పూర్తిగా మీ రాజకీయ జీవితానికి వాడుకొని ఆయన జీవితాన్ని కూడా నాశనం చేశారు. కార్యకర్తల్లో ప్రజల్లో ఎవరు మా వెంబటి తిరిగిన వారిని ఫాలోప్ చేసుకుంటూ మాతో తిరగకుండా చేయడంతో పాటు మా రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి చేశారు. మా కుటుంబం ప్రజలు మీద అభిమానంతో మేము ఇప్పటివరకు ఓపిక పట్టాము, మాకు పార్టీ మారే ఉద్దేశం లేదు మా కుటుంబం ఇప్పటికీ ప్రజలతోనే ఉంది చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటాం ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మాకు ప్రజలకు సేవ చేయాలని భావంతోనే మీతో ఉంటే ప్రజలకు సేవ చేయలేమనే ఉద్దేశ్యంతో రాజీనామా చేస్తున్నాము. మీరు డబ్బు ఉన్నవారికి తప్ప మిగతా వారిని గుర్తించరు మాకు మీ దగ్గర ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదని మేము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం వెల్ముల సుగుణాకర్ రావు, వెల్ముల పుష్పలతాదేవి మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీ, మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ లు తెలిపారు.