- భుజాలు తరుముకున్నటుంది ప్రైవేటు స్కూళ్ల యవ్వారం..!
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 18 :
మెట్ పల్లి పట్టణంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఘటనలకు సంబంధీచిన వీడియోలు ఓ యూట్యూబ్ ఛానల్ లో టెలికాస్ట్ కాగా పట్టణంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఒకరికి ఒకరు ఆ దారుణమైన ఘటన ఏ స్కూల్ ది అంటూ ఒకరికొకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది అలా ఉంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆ వీడియో మనోధైర్యాన్ని నింపినట్లు తెలుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు మొత్తం ప్రైవేటు స్కూళ్లలో ఇదే దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఒకింత అచ్చర్యానికి గురిచేస్తుంది. అంటే విద్య వ్యవస్థ నడిపిస్తున్న ప్రైవేటు స్కూళ్ళు చాలా దారుణంగా వేధిస్తున్నాయని అర్థం అవుతుంది. ఇంత జరిగినా ఉన్నతాధికారులు కన్నెర్ర చేస్తాలేరని విద్యార్థుల తల్లిదండ్రులు అచ్చర్యానికి గురవుతున్నారు. ఇకనైనా ఈ సంవత్సరం పరీక్షలు అయ్యేవరకు మా పిల్లల భవిష్యత్తు స్కూల్ యాజమాన్యం పై ఉంటుంది కనుక మేమేం చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఫీజులు చెల్లించేది తప్పదు. వచ్చే ఏడాదిలో పై తరగతులకు పంపాలంటే మీ స్కూల్ నుండి టి.సి.లు బోనఫైడ్ లు తీసుకోవాల్సిందే అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఫీజులు చెల్లించపోతే ప్రైవేటు బడుల్లో ఎందుకు పంపడం అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా చదువుకుంటే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటదని కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రైవేటులో చదివిపిస్తున్నారు. గౌర్నమెంట్ పాఠశాలలు ఎన్ని ఉన్నా చదువును పూర్తిగా ప్రైవేటుకు పరిమితం చేస్తున్నారని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కడైన ఫిజులు చెల్లించలేదని పరీక్షలు రాయనియ్యకుంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని నెటిజన్లు అంటున్నారు.