Rr News Telangana
క్రైమ్జగిత్యాల

హత్య కేసులో ఇద్ధరు నిందితులకు జీవిత ఖైదు

జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 19 :

వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్తునూరు గ్రామానికి చెందిన బైరం దామోదర్, సింగం రాజయ్య ఇద్దరు స్నేహితులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ కు సింగం రాజయ్యకు పొలం వద్ద నీళ్లు గురించి గొడవ కావడంతో ఆ గొడవలను మనసులో పెట్టుకొన్న శ్రీపతి ప్రభాకర్ మరియు నేరెళ్ల రాజయ్య అనే వ్యక్తి సహాయంతో సింగం రాజయ్యను చంపాలనే ఉద్దేశంతో తేదీ 24- 12- 2009న సింగం రాజయ్య పొలం దగ్గర మాటు వేసి సింగం రాజయ్య తన పొలం నుండి ఇంటికి వస్తుండగా అక్కడే ఉన్న శ్రీపతి ప్రభాకర్, నేరెళ్ల రాజయ్య అప్పటికే తెచ్చుకున్న కత్తులతో సింగం రాజయ్యను వెంబడించగా సింగం రాజయ్య భయపడి గ్రామానికి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. అప్పుడే అటువైపు నుండి తన పొలం పనులు ముగించుకుని వెళ్తున్న బైరం దామోదర్ ను చూసిన శ్రీపతి ప్రభాకర్, నేరెళ్ల రాజయ్యలు సింగం రాజయ్య యొక్క స్నేహితుడైన బైరం దామోదర్ ను తమ వెంట తెచ్చుకున్న కత్తులతో మెడ, కడుపులో పొడవుగా బైరం దామోదర్ అక్కడికక్కడే మరణించాడు.మృతుని తమ్ముడు లచ్చయ్య ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిదితులు శీపతి ప్రభాకర్ ,నేరెళ్ళ రాజయ్యలను కోర్టులో హాజరు పరచడంతో. కేస్ ను విచారించిన న్యాయమూర్తి సుగాలి నారాయణ అడిషనల్ సెషన్ జడ్జి నిదితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 5000 /- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన శ్రీపతి ప్రభాకర్ , నేరెళ్ల రాజయ్య లు కోర్టుకు హాజరు కాకుండా 8 సంవత్సరాలు తప్పించుకుని తిరగడం జరిగిందని, వీరి యొక్క ఆచూకీ కనిపెట్టిన జిల్లా పోలీసులు వారిని పట్టుకుని కోర్టులో హాజరు పరిచి నిందితులకు శిక్ష పడే విధంగా చేయడం జరిగిందని,
ఈ కేసులో అడిషనల్ పీపీ గా మల్లేశం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా దామెర నర్సయ్య ,CMS SI G. రాజునాయక్, కానిస్టేబుల్ కిరణ్ కుమార్ మరియు శ్రీధర్ లు నిందితుల కి శిక్ష పడడంలో, కోర్టుకు సాక్షాధారాలు అందించడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగిందని, నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

Related posts

ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో వ్యక్తి మృతి

Rr News Telangana

అత్యాచారం కేసులో నిందితులకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Rr News Telangana

సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group