Rr News Telangana
జగిత్యాల

జిల్లాకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

జగిత్యాల ప్రతినిధి,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 14 :

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా CISF కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లాకి రావడం జరిగిందని ఎస్పీ అన్నారు. ఈ సందర్బంగా కేంద్ర బలగాల అధికారులు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ …రాబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. కేంద్రం సాయుధ బలగాలను క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో, రూట్ బందోబస్త్, స్ట్రాంగ్ రూమ్ మరియు కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని ఉంచడం జరుగుతుందన్నారు. లోకల్ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి గొడవ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారి కృషి చేసి ఎన్నికల విజయవంతం చేయాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రత భావాన్ని కలిగించాలని అన్నారు. ఎన్నికల పరంగా మరియు సదుపాయాల పరంగా ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పి జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్ వివరాలు, చెక్ పోస్ట్ లు, జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి CISF అధికారులకు ఎస్పీ వివరించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ AR భీమ్ రావు, CISF అసిస్టెంట్ కమాండెంట్ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్ సచిన్ పాల్గొన్నారు.

Related posts

అక్రిడేషన్ కార్డులు అడ్డుపెట్టుకుని వసూళ్ల పర్వం

Rr News Telangana

ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణలో వచ్చిన కథనానికి మండల సర్వేయర్ కు నోటీసులు జారీ

యథేచ్ఛగా హోటల్ లలో సబ్సిడీ సిలెండర్ల సరఫరా

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group