మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 12 :
మెట్ పల్లి పట్టణంలో అనుమతి లేకుండా నడిపిస్తున్న మెడికల్ షాపును మంగళవారం అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే…. మెట్ పల్లి పట్టణంలోని లైఫ్ లైన్ మెడికల్ 2018 నుండి కొనసాగుతుందని, లైఫ్ లైన్ మెడికల్ లైసెన్స్ జనవరి 2024 న ముగిసిందని, లైసెన్స్ రినివల్ చేయకుండా అలాగే నడిపిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి మందులను స్వాధీనం చేసుకుని షాపు ను సీజ్ చేయడం జరిగిందని జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. ఈ తనిఖీల్లో నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసయ్య, జిల్లాల డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉన్నారు.