నిజామాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 04 :
నిజామాబాద్ – బోధన్ పట్టణంలోని బీసీ వసతి గృహంలో ఉండే డిగ్రీ విద్యార్థి వెంకట్ హరియల్(19)ని స్టడీ అవర్ ఇన్‌ఛార్జ్‌గా పెట్టడంతో ఇంటర్ విద్యార్థులను పరీక్షలు జరుగుతున్నాయని, మాట్లాడకుండా చదువుకోవాలంటూ సూచించాడు. ఇది నచ్చని ఆరుగురు ఇంటర్ విద్యార్థులు రాత్రి గదిలో నిద్ర పోతున్న వెంకట్‌పై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆరుగురు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోవడంతో, పోలీసులు విచారణ జరిపి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.