విశాఖపట్నం, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 03 :
విశాఖకు చెందిన ఫొటో గ్రాఫర్ సాయి కుమార్ (23) రావులపాలెంలో దారుణ హత్యకు గురయ్యాడు. వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందని పిలిచి సాయి కుమార్‌ను హత్య చేశారు. సుమారు రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రి కోసం షణ్ముఖ తేజ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేసి పిలిచి అతని స్నేహితుడితో కలిసి సాయి కుమార్‌ను హత్య చేశారు.