- అవినీతిని నిలదీసినందుకే నాపై అవిశ్వాస తీర్మానం పెట్టారు
- తీగల లింగారెడ్డి
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 01 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని విశాల సహకార సంఘంలో శుక్రవారం అవిశ్వాస తీర్మానం చేపట్టారు. ఈ సందర్భంగా తీగల లింగారెడ్డి మాట్లాడుతూ, కొంత మంది సభ్యులు చేస్తున్న తప్పులను ఎత్తిచూపినందుకే నాపై అవిశ్వాస తీర్మానం చేశారని, చెర్లపెల్లి హన్మండ్ల గౌడ్ మోరపు జెలందర్ అనే బినామీ పేరుతో 2015లో దాదాపు 6 లక్షలు తీసుకున్నాడని, ఇప్పటి వరకు అసలు కానీ. వడ్డీ కానీ చెల్లించలేదని, మొత్తం 15 లక్షలు అయ్యాయని, దానికి నోటీసులు పంపించడం జరుగిందని, అల్లకొండ శ్రీకాంత్ ధనలక్ష్మి లోన్ ను 2013 లో 50 వేలు తీసుకున్నాడని, మొత్తం 1.25 లక్షలు అయ్యాయని, జోగినిపెల్లి రాజేందర్ 2013 లో 1.31 లక్షలు అయ్యాయని డబ్బులు కట్టాలని నోటీసులు పంపినందుకు నాపై కక్షకట్టి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని తీగల లింగారెడ్డి అన్నారు.
విశాల సహకార సంఘం డిసిఓ సత్యనారాయణ వివరణ :
విశాల సహకార సంఘం డిసిఓ సత్యనారాయణ వివరణ
కోరగా….సహకార సంఘం అధ్యక్షుడు తీగల లింగారెడ్డి పైన ఫిబ్రవరి 12న అవిశ్వాస తీర్మానం చేయాలని సహకార సంఘం సభ్యులు నోటీసులు ఇవ్వడం జరిగిందని, మార్చి 1 న అవిశ్వాస తీర్మానంపై సభ్యులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా శుక్రవారం అవిశ్వాస తీర్మానం చేయడం జరిగిందని, ఈ అవిశ్వాస తీర్మానంపై తీగల లింగారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ అవిశ్వాసం తీర్మానం ప్రక్రియను పూర్తి చేసి సీల్డ్ కవర్ లో హైకోర్టుకు పంపించడం జరుగుతుందని డిసిఓ సత్యనారాయణ తెలిపారు.