- వసూళ్లకు పాల్పడుతున్న వారి చేతుల్లో అక్రిడేషన్ కార్డులు
- వృత్తి ధర్మాన్ని మరిచి దందాలకు శ్రీకారం
- వార్త రాయలేని వారి చేతిలో అక్రిడేషన్ కార్డులు
- పత్రిక యాజమాన్యాలు దృష్టి సారించాలి
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
వృత్తి ధర్మాన్ని మరిచి కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రిడేషన్ కార్డులను చేతిలో పెట్టుకుని వృత్తికి న్యాయం చేయాల్సింది పోయి అక్రమ సంపాదనకు తెగబడుతున్న దారుణ పరిస్థితి జగిత్యాల జిల్లాలో జరుగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు ఇతర నియోజకవర్గ పరిధిలో కొందరు అక్రిడేషన్ కార్డులను, మరికొందరు ఆయా పత్రికల గుర్తింపు కార్డులను అడ్డుపెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మీడియా వృత్తిలో చిత్తశుద్ధితో కొనసాగే పాత్రికేయుల చేతిలో ఉండాల్సిన అక్రిడేషన్ కార్డులు సెటిల్ మెంట్ లు, దందాలు చేస్తున్న వారి చేతిలో ఉండడం దారుణమని పలువురు సామాజిక కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు విలేకరులమని చెబుతూ అక్రిడేషన్ సమయంలో అర్హత లేని వారు, వార్తలు రాయలేని వారు కూడా 10 నుండి 20 వేలు పెట్టి అక్రిడేషన్ కార్డులు కొనుక్కొని దుర్వినియోగా నికి పాల్పడుతున్నారు.కొన్ని పత్రిక యాజమాన్యాలు వర్కింగ్ జర్నలిస్టులు ఎవరో అర్హత లేని వారెవరో గుర్తించి అక్రిడేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు చేసుకునే సమయంలో క్షుణ్ణంగా పరిశీలించి అథారిటీ లెటర్ విడుదల చేస్తే బాగుం టుందని ప్రజలు భావిస్తున్నారు.