కమ్మర్ పల్లి , ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 21 :
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని క్రిష్ణవేణి హై స్కూల్ పాఠశాలలో మాతృభాష దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం మాతృభాషా గేయంతో ప్రారంభించి తెలుగు భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ మన తల్లితో సమానమైన మాతృభాషను మరవద్దని విద్యార్థులకు తెలిపారు.
బంగ్లాదేశ్ భాష ఉద్యమానికి నివాళిగా , మాతృభాష పరిరక్షణ కొరకు 1999నుండి యెనిస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవాన్ని జరిపాలని పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. అన్యభాషలు ఎన్ని నేర్చుకున్నప్పటికీ మాతృభాష లో ప్రావీన్యుడు కాని వాడు విజ్ఞాన సముపార్జన చేయలేడని తెలిపారు.కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇతర భాషలతో పాటు మాతృభాషను చక్కగా నేర్చుకోవాలని గౌరవించాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థినిలు మాతృభాష తెలుగు పై చేసిన నృత్యం చూపరులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిలక గంగ ప్రసాద్,పాఠశాల డైరెక్టర్ జుంబరత్ రణధీర్, వైస్ ప్రిన్సిపల్ కుందారం సచిన్, ఉపాధ్యాయులు కమల్, మనోజ్ఞ, రమ్య, తబసుమ్, స్వప్న, రూప శ్రీ, నిఖిత, షాహిన్ తదితరులు పాల్గొన్నారు.