Rr News Telangana
తెలంగాణవికారాబాద్

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్

  • బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్వికారాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 20 :

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కెసిఆర్ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. విజయ సంకల్ప యాత్ర లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే ఇపాటికి కెసిఆర్, కేటీఆర్ లను జైల్లో వేసేవాళ్ళమన్నారు. కెసిఆర్ ఫాం హౌస్ ను బుల్డోజర్లతో కూల్చి పేద ప్రజలకు పంపిణీ చేసేవారమన్నారు. బిఆర్ఎస్ పార్టీతో బిజెపి ఎట్టి పరిస్థితుల పొత్తు పెట్టుకోదని స్పష్టం వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గెలిచే ఎంపీ స్థానాలలో చేవెళ్ల మొదటి స్థానంలో ఉంటుందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట చేసింది తమ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాణి రుద్రమదేవి, ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు

Rr News Telangana

మాతా శిశు కేంద్రంలో శిశు అపహరణ

Rr News Telangana

2024-25 రాష్ట్ర బడ్జెట్ లో 25 వేల కోట్లు కేటాయించాలి

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group