జగిత్యాల, ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా ఉన్న పేపర్ పాంప్లెట్స్ సంచలనంగా మారాయి. నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, కోరుట్లలో ఎంపీ అరవింద్ పై సొంత పార్టీలోని కొందరు సీనియర్ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని ఆందోళనలు సైతం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సోమవారం ఉదయం కోరుట్ల, మెట్ పల్లిలో న్యూస్ పేపర్లలో వచ్చిన పాంప్లెట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కండ్లకు ఉన్న కూలింగ్ అద్దాలు తీయడు.. కారు దిగి ప్రజలతో మాట్లాడడు… ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దని ప్రింట్ చేసి ఉన్న పాంప్లెట్లు పై ఈ. కృష్ణమాచారి, పి.గంగాధర్, కే. శ్రీనివాస్, బి. రమేష్ అని పేర్లు రాసి ఉన్నాయి.
2 comments
Very good news pepar
Good news pepar