మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
బీసీ కులగలను తీర్మానం అసెంబ్లీలో ఆమోదం తెలపడం అది బీసీలకు ఒక వరమని ఆదివారం పత్రిక విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి జిల్లా ఉపాధ్యక్షుడు జేట్టి నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కులగణన తీర్మానం బీసీలకు ఒక వారం గా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజల వాస్తవ పరిస్థితులను మరియు వివరాలను శాస్త్రీయంగా స్వీకరించేందుకు సామాజిక ఆర్థిక కులగణన నూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడం చారిత్రకమని అన్నారు. కులగణన లెక్కలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 22 %శాతం నుంచి 42%శాతం శాతానికి పెంచాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే కల్వకుంట్ల సుజిత్ రావు మరియు కొమిరెడ్డి కరంచంద్ లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జేట్టి ప్రదీప్, ఈశ్వర్, శ్రీ వర్ధన్, తేజ మరియు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.