మల్లాపూర్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామంలో అనారోగ్యంతో యువతీ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. రాఘవపేట్ గ్రామానికి చెందిన అలకుంట నడిపి రాజం లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, పెద్ద కూతురికి వివాహం కాగా చిన్న కూతురు పూజ (18) అనారోగ్యానికి గురైంది. హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చేతికి అందిన కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా మృతురాలు తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.