నిజామాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామం శివారులో గత కొన్ని రోజులుగా భారీగా ఇసుక డంపులు నిల్వచేసి ఉండటంతో అధికారుల దృష్టికి రావడంతో మోర్తాడ్ ఆర్ ఐ ఇసుక డంపు ఉన్న స్థలానికి వెళ్లి ఇసుక డంప్ ను సీజ్ చేయడం జరిగినది ఈ యొక్క ఇసుక ఎవరిది అని అధికారులు ఆరా తీయగా బి ఆర్ఎస్ పార్టీ గ్రామ ముఖ్య నాయకుడుదని తెలియవస్తుంది. స్థానిక విలేకరులు మండల అధికారిని దీనిపై వివరణ కోరగా ఈ యొక్క ఇసుక గత కొన్ని రోజులుగా గ్రామంలో నిలువ చేసి ఉన్నదని నమ్మశక్యమైన సమాచారం రావడంతో ఆ స్థలానికి ఆరైని పంపడం జరిగినది పార్టీ యూస్ కెను సీజ్ చేసి సదరు గ్రామస్తులకు సీజ్ చేసిన ఉస్కెను ఎవ్వరు కూడా ముట్టకూడదు అని తెలుపమని ఇట్టి ఉస్కెను మైనింగ్ అధికారుల ఆధ్వర్యంలో వేలంపాట వేసి ఎవరైతే వేలంపాటలో దక్కించుకుంటారో వారికి ఇవ్వడం జరుగుతుందని మోర్తాడ్ తాసిల్దార్ తెలిపారు.