Rr News Telangana
తెలంగాణహైదరాబాద్

ఆక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషిచేస్తా

  • ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు. డిజెఎఫ్ జాతీయ మహాసభ కు ముఖ్య అతిథి గా విచ్చే సిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించా రు.జర్నలిస్టుల పై ప్రభుత్వా లు సానుకూలంగా ఉండాల న్నారు.వారికి విద్య వైద్యం తో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నా రు.కార్పోరేట్ విద్యాల యాలలో జర్నలిస్టులకు 50 శాతం రాయితీ ఇప్పటికే అమలు లో ఉన్నదని కానీ అది కూడా సరిగా అమలు కావటం లేదన్న విషయాలు నా దృష్టికి వచ్చాయని వాటి ప్రామాణికతలలో కూడా మరింత వెసులుబాటు కలిగేలా ప్రయత్నం చేయాలన్నారు.అలాగే ఎక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేద్దామన్నారు.ఈ మేరకు తగిన ప్రతిపాదనను తన వద్దకు తీసుకు వస్తే సంబం ధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూలం గా ఉందని త్వరిత గతిన జర్నలిస్టులకు మంచి జరుగుతున్న దన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Related posts

ఎంపీ సంతోష్ తండ్రిపై కేసు నమోదు

Rr News Telangana

ఎమ్మెల్సీ కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ మూలాఖాత్

Rr News Telangana

వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group