* క్రీడలతో పూర్తి ఆరోగ్యం
* ప్రతి ఒక్కరూ గొప్ప క్రీడాకారులుగా ఎదగాలి
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు ప్రతినిధి ( మన వెలుగు ) డిసెంబర్ 17 :
విద్యార్థినీ, విద్యార్థులు గ్రామస్థాయి క్రీడల నుండి జాతీయస్థాయి క్రీడల వరకు ఎదగాలని, స్వశక్తితోనే క్రీడలలో రాణించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.మంగళవారం ములుగు మండలంలోని జాకారం గ్రామంలో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, జిల్లా క్రీడల అధికారి తుల రవితో కలిసి సీఎం కప్ – 2024 జిల్లా స్థాయి క్రీడలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.కలెక్టర్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలలో రాణించినప్పుడే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరికి డబ్బే ప్రధానం కాదని ఆరోగ్యం ముఖ్యమని, క్రీడా నైపుణ్యం స్వంత శక్తితో వస్తుందని అన్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి క్రీడలలో రాణించి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక కావాలని, రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా యంత్రాంగం మంచి గుర్తింపునిస్తుందని తెలిపారు. జిల్లా స్థాయి కబడ్డీ, హ్యాండ్ బాల్, అథ్లాoటిక్, యోగ , కిక్ బాక్సింగ్ క్రీడల్లో పాల్గొంటున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. క్రీడాకారుల కోసం ఎంత ఖర్చయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, క్రీడాకారులు పదిమందికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. గ్రామ, మండల స్థాయిలో ప్రతిభ కనపరచి జిల్లా స్థాయికి వచ్చిన క్రీడాకారులు అదే ఉత్సాహంతో ఇక్కడ నుండి రాష్ట్ర స్థాయి కి వెళ్లలని అన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ మాట్లాడుతూ క్రీడాల వల్ల దేహదారుధ్యం, క్రమశిక్షణ ఏర్పడుతుందను, ఈ క్రీడాలు అందరు ఉత్సాహంగా పాల్గొన్నరని, క్రీడలో గెలుపు ఓటమిలు సహజం ఓడినా వాళ్లు కుంగి పోకుండా గెలుపు కై ముందుకు సాగాలన్నారు.సీఎం కప్ మన జిల్లా కి వచ్చేలా మిగతా క్రీడాకారులతో పోటీ పడాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్, ఎంపీ డి ఓ లు, పి టి లు, 9 మండలాల క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.