శాసన సభలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
నిర్మల్ ప్రతినిధి ( మన వెలుగు ) డిసెంబర్ 17 :
ముధోల్ నియోజకవర్గంలో కొత్తగా మూడు మండలాలు ఏర్పాటు చేయాలని శాసనసభలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడారు. బేల్ తరోడ, పల్సి, మాలేగాం లను మండలాలుగా ప్రకటించాలన్నారు. 30 మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోలో తమ నూతన మండలాల పేర్లు లేవని, తక్షణమే జాబితాలో చేర్చి కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు.