మెట్ పల్లి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) డిసెంబర్ 07 :
మానవత్వం చాటుకున్నారు మారుతి, కిరణ్ లు..వివరాల్లోకి వెళితే…జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ నుండి మార్కెట్ వెళ్లే దారిలో చావిడికి సామ మారుతి షాపు ముందు మూడు లక్షలు పడి ఉండటాన్ని గమనించిన మారుతి, కిరణ్ లు ఆ మూడు లక్షల రూపాయలను శనివారం సిఐ నిరంజన్ రెడ్డికి అప్పగించారు. ఈ సందర్భంగా సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… ఆ డబ్బులు పోగొట్టుకున్న వారు సరైన ఆధారాలను చూపించి పోలీస్ స్టేషన్ కు వచ్చి డబ్బులు తీసుకెళ్లాలని సీఐ ఏ.నిరంజన్ రెడ్డి తెలిపారు.దీనితో సామ మారుతి, కిరణ్ ను సిఐ నిరంజన్ రెడ్డి అభినందించారు.