Rr News Telangana
ములుగు

సర్వీస్ రివాల్వర్‌‌ తో కాల్చుకుని ఎస్ఐ మృతి

ములుగు ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) డిసెంబర్ 02 :

సర్వీస్ రివాల్వర్‌ తో కాల్చుకుని ఎస్ ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో రుద్రారపు హరీశ్ ఎస్సై‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రడ్జి సమీపంలో ఉన్న ఓ రిసార్ట్‌ లో హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ములుగు జిల్లాలో నిన్న ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం లేపుతుంది, ఉన్నంత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group