ప్రభుత్వం మారిన ప్రభుత్వ అధికారులు మారలే
* యథేచ్ఛగా హోటల్ లలో సబ్సిడీ సిలెండర్ల సరఫరా
*అధికారులకు ఫిర్యాదు చేస్తే డిస్టిబ్యూటర్ లకు సమాచారం
* అధికారులు అమ్యామ్యాలకు అమ్ముడుపోయారా…?
జగిత్యాల ప్రతినిధి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) నవంబర్ 17 :
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం గ్యాస్ (HP) సబ్సిడీ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. కానీ అవి సక్రమంగా వినియోగదారులకు అందుతున్నా యంటే పొరపాటే. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో టీ స్టాల్స్ టిఫిన్ సెంటర్స్ హోటల్ లలో చాలా మంది సబ్సిడీ సిలెండర్లు వాడుతున్నారు. హోటల్ లలో సబ్సిడీ సిలెండర్లు వాడుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏకంగా అధికారులు స్థానిక డిస్టిబ్యూటర్లకు సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు డిస్టిబ్యూటర్ లతో కుమ్మక్కయ్యి లంచాలు తీసుకుం టున్నారని పలువురు బహిరంగంగానే చెపుతున్నారు. జిల్లాలో వందల సంఖ్యలో హోటల్ లు ఉన్నాయి కానీ కమర్షియల్ సిలిండర్లు మాత్రం వాడటం లేదు. ప్రతి హోటల్ లలో సబ్సిడీ సిలెండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. వీటిని నియంత్రించే అధికారులు మాత్రం కనిపించడం లేదు. ఒకవేళ అధికారులు వస్తే ముందుగానే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్ కి సమాచారం అందిస్తున్నారు. ఈ విషయం డెలివరీ బాయ్స్ కి డిస్టిబ్యూటర్ సమాచారం అందించడంతో డెలివరీ బాయ్స్ ముందుగానే హోటల్ యాజమాన్యాలకు సమాచారం అందిసున్నారు. దీనితో హోటల్ యాజమాన్యాలు అప్రమత్తం అవుతున్నారు. వందల సంఖ్యలో పట్టుబడవలసిన సబ్సిడీ సిలిండర్లు కేవలం పదుల సంఖ్యలోనే పట్టుబడటం పలు విమర్శలకు దారితీస్తుంది. ఒక్క మెట్ పల్లి పట్టణం నుండి మూడు బొమ్మల మేడిపల్లి వరకు 134 టీ స్టాళ్లు టిఫిన్ సెంటర్లు హోటల్ లు ఉన్నాయి. ఈ హోటల్స్ కు నిత్యం వందలాది సబ్సిడీ సిలిండర్లు ఆటోలో సరఫరా అవుతున్నాయి.ఈ సబ్సిడీ సిలెండర్లు పట్టణానికి పల్లెలకు ప్రభుత్వం అందిస్తున్న రేటుకే హోటల్ లకు సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని చూస్తే గ్యాస్ వినియోగదారుల కేంద్రాల ఫోన్ మాత్రం పనిచేయదు.ఏకంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే మాత్రం గ్యాస్ సరఫరా చేస్తున్న డిస్టిబ్యూటర్ లకు సమాచారం వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభయ హస్తం పథకంలో భాగంగా 500 రూపాయల సబ్సిడీ సిలెండర్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కోట్లలో భారం నష్టం కలుగుతుంది. ప్రభుత్వం అందించే సబ్సిడీ సిలెండర్లు బహిరంగం ప్రదేశాల్లో కమర్షియల్ సిలిండర్లకు బదులు సబ్సిడీ సిలిండర్లు వినియోగిస్తున్న హోటల్ లపై అధికారులు చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.15 రూపాయలకు ప్లేట్ ఇచ్చే టిఫిన్ సెంటర్ల నుండి 50 రూపాయలకు ప్లేట్ ఇచ్చే హోటళ్ల వరకు సబ్సిడీ సిలిండర్లని వాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఐదు రూపాయలు ఉన్న టీ ఇప్పుడు అధిక ధరల సాకుతో పది రూపాయలు చేసి అమ్ముతున్నా రు. ప్రభుత్వం ధరలు పెంచిందని సాకులు చెప్పేవాళ్లు ప్రభుత్వ సబ్సిడీ సిలెండర్లును ఎందుకు ఉపయోగిస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి, ఆమ్యా మ్యాలకు అమ్ముడు పోకుండా జిల్లా వ్యాప్తంగా టీ స్టాల్ మరియు టిఫిన్ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.