మెట్ పల్లి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ )
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా గుండెకు సంబదించిన వ్యాధితో బాధపడుతున్నారు. కాగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందారు. గత 19 నెలల క్రితం మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు మరణించగా, నేడు కొమిరెడ్డి జ్యోతక్క మరణించడంతో కొమిరెడ్డి జ్యోతక్క అభిమానులు, కోరుట్ల నియోజకవర్గ ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు.