Rr News Telangana
మెట్ పల్లి

యశోద హాస్పిటల్ డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి వరద కాలువలో గల్లంతు అయ్యాడా..ఎవరైనా తోసేశారా..?

 * ప్రమాదవశాత్తు జరిగిందా…కావాలనే తోసేశారా..?

* అసలు జరిగింది ఏంటి…?

 

జగిత్యాల ప్రతినిధి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 27 :

మెట్ పల్లి పట్టణంలోని యశోద హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న హనుమకొండ జిల్లాకు చెందిన డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి విట్టంపేట శివారులో గల వరద కాలువలో గల్లంతు అయ్యాడు. పట్టణంలోని శ్రీ సాయి లక్ష్మీ నివాస్ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ అశోక్ రెడ్డి యశోద హాస్పిటల్ పనిచేస్తున్న ఉదయ్ కిరణ్ రెడ్డి, రాయికల్ పట్టణంలోని యశోద హాస్పిటల్ లో పనిచేస్తున్న ప్రశాంత్ కుమార్, సాయి లక్ష్మీ శ్రీనివాస్ ఆసుపత్రి యజమాని ఆత్మకూరు రాజు డాక్టర్ అశోక్ రెడ్డి బంధువు లింగాల లిఖిత్ రెడ్డి లతో కలసి రెండు కార్లలో మెట్ పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామానికి వెళ్లి ఈతకల్లు తాగారు. అనంతరం మార్గ మధ్యలో ఉన్న విట్టంపేట వరద కాలువలో స్నానం చేద్దాం అనుకొని వరద కాలువ దగ్గరకు డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి వెళ్ళాడు అని పలువురు తెలిపారు. కానీ డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి వెళ్లాడా…? లేక ఎవరైనా కావాలనే డాక్టర్ ఉదయ్ ని తీసుకువెళ్లారా అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బెట్ వల్లే డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి గల్లంతయ్యాడా..?

డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డిని కావాలనే రెచ్చగొట్టి బెట్ పెట్టుకొని కావాలనే ఉదయ్ కిరణ్ రెడ్డిని వరద కాలువకొని దింపారా..? లేక ఎవరైనా ఉదయ్ కిరణ్ రెడ్డిని తోసేశారా అనే అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది డాక్టర్ లతో మద్యం సేవించిన డాక్టర్ ఉదయ్ విట్టంపేట వద్ద ఉన్న వరద కాలువలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది. ఎవరైనా కావాలనే డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డిని తీసుకువెళ్లారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం మాత్రం బలయ్యంది..?

ఒక డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఉదయ్ కిరణ్ రెడ్డి మద్యం మత్తులో ఉన్నానని తెలిసి కూడా వరద కాలువలోకి తన కారు తీసుకొని వెళ్లడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఓ నిండు ప్రాణం మాత్రం బలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈత వచ్చిన డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి తన ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోయాడు…?

నిజంగా డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డికి ఈత వస్తే కనీసం ఒడ్డు

వద్దకైనా చేరేవాడు కద..అలాంటిది ఈత వచ్చి కూడా తన ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోయాడు అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

అసలు జరిగింది ఏంటి…?

డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డిని ఎవరు తాగడానికి తీసుకొని వెళ్లారు. అతడిని తీసుకొని వెళ్లిన తర్వాత అక్కడ ఏమైనా గొడవ జరిగిందా లేక తాగిన మైకంలోనే స్నానం చేద్దామని వెళ్లాడా..? అతడితో ఉన్న తోటి డాక్టర్ లు నిజాలనే చేపుతున్నారని ఏలా నమ్మాలి, ఎవరో కొంత మంది మహిళలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారని వారి కాంటాక్ట్ నెంబర్ కూడా మా దగ్గర ఉందని స్థానిక పోలీసులకు ఆ మహిళ నెంబర్ ఇచ్చారు…కానీ ముక్కు ముఖం తెలియని వారికి ఆ మహిళ ఫోన్ నెంబర్ ఎలా ఇచ్చింది. సాధారణంగా ఏ మహిళ అయిన తన ఫోన్ నెంబర్ ను ఇవ్వాలంటే జక్కుతుంది అలాంటిది. తాము కళ్లారా చూశానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆ ఘటన జరిగినప్పుడు ఆ మహిళ అక్కడ ఎందుకు ఉంది…?

డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి వరద కాలువలో కొట్టుకొని మా ముందే వెళ్లాడని ఆ మహిళ చెప్పడంపై అనుమానాలు తావిస్తోంది. ఆ బ్రిడ్జి వద్ద నుండి రోజు కొన్ని వందల వాహనాలు వెళుతూ ఉంటాయి. ఎవరూ చూడలేదు కానీ…? ఆ మహిళ కుటుంబ ఎలా చూసింది.. అసలు నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారా లేకా..ఎవరో చెప్పారని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని కేసును కొట్టి వేస్తారా అని చూడాలి మరి….

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

సంఘన స్థలానికి చేరుకున్న డిఎస్పీ ఉమామహేశ్వరరావు, సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి లు సంఘటన స్థలానికి చేరుకొని తోటి డాక్టర్ లను వివరాలను అడిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related posts

ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు

Rr News Telangana

బిజెపికి మరో షాక్

Rr News Telangana

బిఆర్ఎస్ లో గుర్తింపు లేదు.. అందుకే రాజీనామా

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group