మేడిపల్లి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 20 :
తెలంగాణ పోలీస్ కు సంబంధించి జరిగిన మొట్టమొదటి డ్యూటీ మీటింగు ఎంపికైన జగిత్యాల జిల్లా మేడిపల్లి ఎస్ఐ శ్యామ్ రాజ్. తెలంగాణ రాష్ట్రం పోలీస్ నిర్వహించిన మొట్టమొదటి డ్యూటీ మీట్ కు సంబంధించి మొదటగా జిల్లాస్థాయి ఆ తర్వాత జోనల్ స్థాయి జరిగినటువంటి ఎగ్జామ్లలో ప్రతిభ కనబరిచి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి డ్యూటీ మీటికీ జోన్ తరఫున జగిత్యాల జిల్లా నుండి మేడిపల్లి ఎస్ఐ శ్యామ్ రాజ్ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. ఈ డ్యూటీ మీట్ నందు రాష్ట్ర పోలీసులకు Scientific Aids to Investiga tation కి సంబంధించి ఐదు విభాగాలు ఫింగర్ ప్రింట్, హ్యాండ్లింగ్ లిఫ్టింగ్ ప్యాకింగ్, ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, క్రిమినల్ లా కి సంబంధించిన ఎగ్జామ్ లలో జగిత్యాల జిల్లా తరఫున పాల్గొన్న ఎస్ఐ శ్యామ్ రాజ్ ను జిల్లా స్థాయి అధికారులు అభినందనలు తెలిపారు. ఈ స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.