మెట్ పల్లి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 20 :
మెట్ పల్లి పట్టణం లోని 24 వ వార్డు పోచమ్మ వాడ మార్కండేయ మందిరం వెనకాల గల విద్యుత్ స్తంభం వార్డు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది స్తంభానికి చెందిన సపోర్టు వైరు ఎండిపోయిన చెట్టుకు కట్టడంతో ఏ క్షణాన విరిగి పడుతుందోనని వాడకట్టు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మొన్నటి వర్షాకాలంలో సపోర్టు వైరు కట్టిన చెట్టుకు కరెంటు సరఫరా అవుతుందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని చెట్టు ఎండిపోయి శిధిలావస్తాలో ఉన్నదని ఏ క్షణాన చెట్టు లేదా కరెంటు స్తంభం జనాలపై పడి ఆస్తి నష్టం విద్యుత్ ఘాతం వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని వార్డు ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని 24 వ వార్డు ప్రజలు కోరుతున్నారు.