Rr News Telangana
జగిత్యాలమెట్ పల్లి

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రవేట్ డ్రైవర్ లే పోలీసులు

* జర్నలిస్ట్ ఫోన్ లో రికార్డు అయిన డాటాను డిలీట్ చేసిన మెట్ పల్లి పోలీస్  ప్రవేట్ డ్రైవర్

* ప్రవేట్ డ్రైవర్ కు జర్నలిస్ట్ ఫోన్ లాక్కునే హక్కు ఎవడిచ్చాడు

* అన్ని ఆధారాలు ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ చేతిలో

* నేడు కోర్టులో ప్రవేట్ కేసు వేయనున్న ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ సీఈవో గట్టిపెల్లి రాజశేఖర్

మెట్ పల్లి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ  ) అక్టోబర్ 18 :

 

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కీర్తి ఫాక్షన్ హల్ వెనుక భాగంలో ఉన్న ఓ మహిళ హాస్టల్ సమీపంలో ఉన్న కాళీ స్థలంలో కొంతమంది పోకిరీలు అమ్మాయిలను వేదిస్తున్నారని సమాచారం మేరకు ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ టీమ్ శుక్రవారం సామాన్యుడి లాగా ఓ మందు బాటిల్ పెట్టుకొని నిందితులను పట్టించేందుకు సాహసం చేసి స్థానిక మెట్ పల్లి సిఐ గారికి సమాచారం అందించడం జరిగింది. దీనితో పాటు తాము విలేఖరులమీ తెలియకుండా మందు బాటిల్ పెట్టుకోని కూర్చున్నట్లు స్థానిక సిఐ గారికి సమాచారం అందించడం జరిగింది. స్పందించిన సిఐ నిరంజన్ రెడ్డి అందుబాటులో ఉన్న కానిస్టేబుల్ జనార్దన్ ను సంఘటన స్థలానికి పంపించడం జరిగింది. కాని అక్కడికి వచ్చిన పోలీస్ ఓ ప్రవేట్ డ్రైవర్ తాను ఎస్ ఐ చిరంజీవి డ్రైవర్ ను అంటూ ఆర్ ఆర్ న్యూజ్ తెలంగాణ జర్నలిస్ట్ పై నానా బూతులు తిడుతూ ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ రిపోర్టర్ లు తీసిన వీడియోలను రికార్డు చేసిన ఫోన్ లాక్కొని తనకు సంబంధించిన వ్యక్తులను అక్కడి నుండి పంపించారు. దీనితో ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ టీమ్ స్థానిక మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగి విషయాన్ని ఎస్ఐ గారికి తెలిపారు. కానీ అప్పటికే ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ రికార్డ్ చేసిన కొన్నీ ఇంపార్టెంట్ వీడియోలని మెట్ పల్లి ఎస్ఐ ప్రవేట్ డ్రైవర్ డిలిట్ చేయడం జరిగింది.దీనితో ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ సీఈవో గట్టిపెల్లి రాజశేఖర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల పేరు చెప్పుకొని ఓ ప్రవేట్ డ్రైవర్ జర్నలిస్ట్ ల ఫోన్ ను ఎలా లాక్కుంటారని, నిలదీయడంతో, అందులో రికార్డు అయిన వీడియోను డిలీట్ చేసి ఫోన్ ను రిపోర్టర్ కు అప్పగించడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పాపనికి తాము తాగినట్టు స్థానిక పోలీస్ కానిస్టేబుల్ లతో రికార్డ్ చేయించి తాగి స్టేషన్ కు వచ్చారని సీనియర్ జర్నలిస్ట్ పై నేరాన్ని వేయడంతో సిఐ నిరంజన్ రెడ్డితో మాట్లాడినా రికార్డుతో పాటు పోలీస్ డ్రైవర్ ను అని చెప్పుకునే వ్యకి పై శనివారం కోర్టులో ఆధారాలతో సహా ప్రవేట్ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ సీఈవో గట్టిపెల్లి రాజశేఖర్ తెలిపారు. ఓ ప్రవేట్ డ్రైవర్ ఎస్ఐ మనిషినంటూ జర్నలిస్ట్ లపై దౌర్జన్యం చేయడం పై ఆర్ ఆర్ తెలంగాణ సీఈఓ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణకు సంబంధించిన ఫోన్ ను లాక్కొని పోలీస్ స్టేషన్ లోనే ఎమ్ పిక్కుట్టారో పిక్కొండని ఓ ప్రవేట్ డ్రైవర్ చెప్పడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా శుక్రవారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ప్రవేట్ డ్రైవర్ లు చేస్తున్న అక్రమాలపై కోర్టులో ప్రవేట్ కేసు పెట్టడానికి అన్ని సిద్ధం చేశామని ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ యాజమాన్యం స్పష్టం చేసింది. అక్కడ జరిగిన సంఘటనను ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ వీడియో తీస్తే ఆ వీడియోను డిలీట్ చేసే హక్కు ప్రవేట్ డ్రైవర్ కు ఎవరిచ్చారో స్థానిక పోలీసులు లేదా వారికి సంబంధించిన అధికారులు స్పష్టం చేయాలని ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ కోర్టులో ప్రవేట్ కేసు దాఖలు చేస్తుంది.ఏది ఏమైన ఓ జర్నలిస్ట్ ఫోన్లను లాక్కొని అందులో ఉన్న వీడియోలను డిలీట్ చేసే హక్కు ప్రవేట్ డ్రైవర్ లకు ఎవరిచ్చారు స్థానిక పోలీసులనే చెప్పాలని నేడు ప్రవేట్ కేసు వేస్తున్నట్లు జర్నలిస్ట్ తెలిపారు. కొంతమంది జర్నలిస్ట్ లు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిజాలను నిర్భయంగా రాస్తుంటే ప్రవేట్ డ్రైవర్ లు ఫోన్ లను లాక్కొని అందులో ఉన్న మెయిన్ వీడియోలను డిలీట్ చేసి అప్పుడే కొంత వీడియోలను ప్రవేట్ డ్రైవర్ లతో తీయించి తాగి స్టేషన్ కు వచ్చారని బుకాయిచడం పోలీసులకు ఫ్యాషన్ గా పారింది.

ఎంత దురమైన వెలుతాం…గట్టిపెల్లి రాజశేఖర్…!

నిజాలను నిర్భయంగా రాస్తున్న ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ జర్నలిస్టులపై పోలీసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టిన కోర్టుపై తమకు నమ్మకం ఉందని, గతంలో ఓ కౌన్సిలర్ చేసిన అక్రమాలను నిర్భయంగా రాస్తే తమపై అక్రమ కేసు పెట్టారని దానికి కూడా ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ఎదురుకోవడానికి సిద్ధంగా ఉందని, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ రిపోర్టర్ పై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సి ఎస్టీ కేసును కూడా అక్రమంగా పెట్టారని ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ చేస్తున్న పోరాటంలో అక్రమ కేసులు ఎన్ని పెట్టిన ఎదురుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ సీఈవో గట్టిపెల్లి రాజశేఖర్ స్పష్టం చేశారు.

Related posts

పోలీస్ పతకాలకు ఎంపికైన వారిని అభినదించిన జిల్లా ఎస్పీ

Rr News Telangana

మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రి నలుగురి వైద్యుల డెప్యూటషన్లు రద్దు

Rr News Telangana

2024-25 రాష్ట్ర బడ్జెట్ లో 25 వేల కోట్లు కేటాయించాలి

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group