జగిత్యాల జిల్లాలోని కట్లకుంటలో వాల్ పోస్టర్ల కలకలం
జగిత్యాల ప్రతినిధి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 14 :
మంత్రగాళ్లను ఒక్కొక్కళ్ళను చంపబోతున్నాం అంటూ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో వాల్ పోస్టర్ల కలకలం రేపుతోంది. మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని పలుచోట్ల గుర్తు తెలియని వ్యక్తులు మంత్రగాళ్లను ఒక్కొక్కళ్ళను చంపబోతున్నాం అంటూ వాల్ పోస్టర్ లను అతికించారు. ఆ వాల్ పోస్టర్ లో మంత్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నాం ఈ పని కట్లకుంట గ్రామంలో గల గచ్చునుతి దగ్గర ఉన్న ఇద్దరు మంత్రగాళ్లతో మొదలు పెడతాము, ఆ తర్వాత గుండ్లవాడ గొల్ల మరియు గౌండ్ల వాడ పాల కేంద్రం చుట్టుపక్కల మరియు మాల మాదిగల వాడకట్టులలో ఉన్న మంత్రగాళ్లు అందరిని చంపుతాము ఎవరిని ఎప్పుడు ఎలా చంపుతామో తెలియదు. ముఖ్యంగా గ్రామ ప్రజలకు మనవి ఇప్పటివరకు మీరు చూస్తూ ఎలా ఉన్నారో అలాగే ఉండండి అలా కాక మంత్రగాళ్లకు సపోర్టు చేశారో మీకు కూడా ప్రాణా పాయం ఉండొచ్చు అని అనేకమంది బాధలు పడుతున్నారు. ఈ మంత్రగాళ్ళ వల్ల అంటూ వాల్ పోస్టర్లు అతికించారు. ఇట్లు… గ్రామ ప్రజల మంచి కోరే సంస్థ అని పోస్టర్ అతికించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వాల్ పోస్టర్ల పని ఆకతాయిల లేక నిజమైన వార్నింగా అనేది తెలియక తికమక పడుతున్నారు గ్రామస్తులు. ఏదిఏమైనా మంత్రగాళ్ల ను చంపబోతున్నామని ఇలా బహిరంగ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.