- సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు
- ఓ విలేఖరి మీ స్థానం ఎక్కడ…?
జగిత్యాల ప్రతినిధి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 13 :
ఓ విలేఖరి మీ స్థానం ఎక్కడ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయక ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వార్తలను సేకరించి నిజాలను నిర్భయంగా రాసి పాఠకుల మరియు ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసిన విలేఖరులు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు. అలాగే ఏదో ఒక గ్రామంలో ఏదైనా ఘటన జరిగితే విలేఖరికి తెలిసిన వెంటనే మరొక్క విలేఖరితో బ్రదర్ పలానా చోట ఏదో సంఘటన జరిగిందని వెళదాం పద అని నిజానిజాలను తనదైన శైలిలో రాబట్టి ప్రజలకు తెలిపే రోజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి.
మొత్తం కాపీ పేస్టు రాయుల్లదే హవా…!
ఇక అసలు కథలోకి వెళితే ఏ పార్టీ అయినా నాయకుని అనుచరగణం కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతూ నాయకుల, ఉపనాయకుల , మన్ననల కోసం ఇష్టానుసారంగా వారికి తోసినది పోస్టులు పెట్టడం ద్వారా నాయకులకు లాభమా నష్టమా..! ముఖ్యంగా వారికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో పోస్టులు పెట్టడం ద్వారా నాయకులు చేసే మంచి పని ఏది ప్రజల దగ్గరికి వెళ్లడం లేదు. దానికి తోడు ప్రతి పార్టీలో సోషల్ మీడియా ఇంచార్జ్ అసలు ఈ సంస్కృతి ఎంత దూరం పోయింది అంటే.. ఒక వార్త రాయడానికి అను భవం ఉన్న విలేకరి దానిలోని తప్పులను సరిచూసుకొని నాయకులకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుని వార్తను రాయడం లేదా వీడియో తీయడం చేసేవారు కానీ ఇప్పుడు గ్రూప్ లలో వచ్చిన వార్తలను కాపీ పేస్ట్ చేస్తున్నారు.
ఉపనాయకులు, కార్యకర్తలు చేసే హంగామా అంతా ఇంతా కాదు…!
నాయకుడు ప్రజలకు ఏమి చెప్తున్నాడు అన్నది పక్కన పెట్టి వీరు చేసే స్లొగన్స్ వల్ల నాయకుని మనసులో ఏముందో ప్రజలకు ప్రభుత్వానికి తెలియకుండా మీడియా లో మొత్తం వీరే….కవరేజ్ అయ్యేవిధంగా వీడియో క్లిప్పులు తీసి కాపీ పేస్ట్ చేసే మీడియా మిత్రులకు పంపడం వారు యధావిధిగా ప్రసారం చేయడంతో నష్టపోయేది ఎవరు….! ముఖ్యంగా మల్టీమీడియా ఛానల్లో ఏ వ్యక్తి అయినా అభ్యంతరకర వాక్యాలు మాట్లాడిన బీప్ సౌండ్ తో మేనేజ్ చేసి నాయకుని లేదా ఆ వ్యక్తి గౌరవాన్ని కాపాడేవారు ఇప్పుడు ఎంత అశ్లీలంగా మాట్లాడితే అదే , గొప్ప వార్త క్లిప్పును పదే పదే వేసి అంత బాగా చూపిస్తు న్నారు దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు ముమ్మాటికి ఆ పార్టీల నాయకులే…! ఇంకో గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీ కావచ్చు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు బిజెపి కావచ్చు లేదా ఎంఐఎం కావచ్చు ఆయా పార్టీలను తమ భుజస్కంధా లపై మోస్తున్నట్టు మేము చేయబట్టే పార్టీ మనుగడలో ఉన్నట్టు నటించే కోవర్ట్ ల హంగామా అంతా ఇంతా కాదు వీళ్ళు చేసే పనుల వల్ల నాయకులే కాదు మీడియా మిత్రులు కూడా మోసపోతున్నారు. దీనివల్ల ఆ పార్టీ యొక్క ముఖ చిత్రం ప్రజల వరకు చేరడం లేదు సొంత ప్రయోజనాల కోసం విలేకరులుగా అవతరం ఎత్తి కొందరు లబ్ధి పొందుతున్నారే తప్ప ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏమి ఉన్న విలేకరుల సమక్షంలో ప్రభుత్వాలకు ప్రజలకు చేరే విధంగా మీ కార్యక్రమాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.