జగిత్యాల ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) సెప్టెంబర్ 29 :
జగిత్యాల జిల్లాకు చెందిన యూ ట్యూబ్ ఫేం సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు అయ్యింది. కొన్నేళ్ళ క్రితం పరిచయమై యువతికి మాయ మాటలు చెప్పి లొంగతీసుకుని రేప్ చేశాడని యువతి తెలిపింది. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్న యువతి. పెళ్లి చేసుకోవాలని తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేస్తుంది.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.