జగిత్యాల ప్రతినిధి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) సెప్టెంబర్ 22 :
జగిత్యాల జిల్లా చిన్నగట్టుపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి శానిటేషన్ సూపర్వైజర్ మరియు కొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని హిందూ సేన సమితి సభ్యులు శనివారం జగిత్యాల రూరల్ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హిందూ సేన సమితి సభ్యులు మాట్లాడుతూ…. హిందువుల ఆరాధ్య ఆలయం ఆంజనేయ స్వామి చిన్నగట్టుపై మధ్య మాంసంలు సేవిస్తూ డీజే పాటలతో ఒళ్ళు మరిచి అసభ్యకరమైన పాటలకు చిందులేస్తు ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల రూరల్ సిఐ కి ఫిర్యాదు చేసినట్లు హిందూ సేన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లె సాయి గణేష్, పల్లపు అంజి, కుర్మ రాజేందర్,బొల్లం అజయ్, అబ్బాడి సోమేశ్వర్, శ్రీకాంత్, ఉమ్మడి శ్రీనివాస్, శ్రీకాంత్, కుంచెపు అజయ్,బుర్ర వేణు, జక్కుల శేఖర్, సిద్ధం కిషోర్, తీర్పురం సాయి తదితరులు పాల్గొన్నారు.