- సిఐ నిరంజన్ రెడ్డి
మెట్ పల్లి ( ఆర్.ఆర్.న్యూస్ తెలంగాణ ) సెప్టెంబర్ 14 :
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వినాయక
నిమజ్జనం రోజు అల్లర్లు సృష్టిస్తే రౌడీ షీట్లు తెరుస్తామని మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మెట్ పల్లి సర్కిల్ పరిధిలో ఈ నెల 16, 17 తేదీలలో జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యం లో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే రౌడీ షీటర్లు, ఆటంకం కలిగించే వారితో పాటు డీ జె నిర్వాహకులను తహశీల్దార్ ల ఎదుట బైండో వర్ చేయడం జరిగిందని, మెట్ పల్లిలో 96 మందిని, మల్లాపూర్ లో 42మందిని, ఇబ్రహీంపట్నంలో 37 మందిని బైండో వేర్ చేశామని. కొత్తగా ఎవరైనా నిమజ్జనం రోజున అల్లర్లు చేసి ఆటంకం కలిగిస్తే వారిపై కూడా రౌడీ షీట్లు తెరుస్తామని. రౌడీ షీట్లతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని. దీనిని దృష్టిలో పెట్టుకుని వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపు కోవాలి. నిమజ్జనం మధ్యాహ్నం 12గంటల నుంచి మొదలు పెట్టి రాత్రి 11గంటల లోపు ముగించాలని. డీజె నిర్వాహ కులు ఎట్టి పరిస్థితుల్లోను సౌండ్ బాక్సులు ఇవ్వవద్దని. ఒకవేళ ఇస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని,మద్యం షాపులు మూసివేయాలని, నిబంధనలు ఉల్లంగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా మని,గ్రామాల్లో కూడా ఎక్కడైనా మద్యం అమ్మితే తీవ్రమైన చర్యలు ఉంటాయని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి అందరూ పోలీసులకు సహకరించాలని అన్నారు. దాదాపు వంద సీసీ కెమెరాలు అమర్చబడినవని, 150 మంది పోలీసులు మరొక 50 మంది స్పెషల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని మరియు ట్రాఫిక్ నిబంధనలు ఈ క్రింది విధంగా ఉంటాయని, అయ్యప్ప గుడి వద్ద నుండి పాత బస్టాండ్ మీదుగా వట్టివాగు వరకు వన్ వే ట్రాఫిక్ ఉంతుందని నిమజ్జనం దగ్గర ఇరువైపులా భారీ కేడ్లు అమర్చ బడ్డాయని, ట్రాఫిక్ పోలీసులు చెప్పిన విధంగా ప్రజలు సంయమనం పాటించి ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని మరియు నిమజ్జనం జరుగు సమయంలో రోడ్డుకు నిమజ్జనం మొదలగు స్థలం నుండి నిమజ్జనం జరిగే స్థలం వరకు ఇరువైపులా షాపులను మూసివేయాలని వ్యాపారస్తులను కోరారు.ఈ బందోబస్తు మెట్పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుందని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.