- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి ( ఆర్.ఆర్.న్యూస్ తెలంగాణ ) సెప్టెంబర్ 13 :
గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డిఎస్పీలు, సి.ఐ లతో శుక్రవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. గణేష్ నిమజ్జనోత్సవo ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పోలీస్ అదికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలన్నారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు. నిమజ్జననకి డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని సూచించారు. ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిని బైండోవర్ చేయాలని అన్నారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాల న్నారు. నిమజ్జనోత్సవానికి అవసరమైన నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయ వంతం చేయాలని సూచించారు. శాంతి పూర్వకమైన వాతావరణంలో వినాయకుని నిమార్జనం జరగాలని దానికి ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిచాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో డిఎస్పీలు రఘుచంధర్, ఉమా మహేశ్వర రావు,డిసిఆర్బీ,ఎస్బి,సీసీఎస్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్,అరఫ్ అలీ ఖాన్,లక్ష్మీనారాయణ,సిఐ లు వేణుగోపాల్,రవి, కృష్ణ రెడ్డి,సురేష్ ,నిరంజన్ రెడ్డి ఉన్నారు.