జగిత్యాల ప్రతినిధి, ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) ఆగస్టు 27 :
మహిళల రక్షణకై, వారి చట్టాలపై అవగాహన లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మహిళల పై జరిగే నేరాలపై పోలీసులకు సంప్రదించవలసిన తీరుపై, షీ టీం పనితీరు గురించి జిల్లా కేంద్రంలోని బొంబాయి షాపింగ్ మాల్ లో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షి టీo ఏఎస్ఐ వాలి బెగ్ మాట్లాడుతూ… మహిళల రక్షణకై వారిపై జరుగు నేరాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షీ టీం పని చేస్తుందని అన్నారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళల పై నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతా యిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళలు యువ తులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీం నెంబర్ కి 8712670783 సంప్రదించాలని అన్నారు. సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురి అయినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ వాలీబెగ్, మహిళా కానిస్టేబుల్ లు పాల్గోన్నారు.