Rr News Telangana
మెట్ పల్లి

పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలి

  • చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు పై నిఘా ఉంచాలి
  • గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి

మెట్ పల్లి, ( ఆర్ ఆర్ న్యూస్  ) ఆగస్టు 26 : 

జగిత్యాల జిల్లా మెట్ పల్లి డీఎస్పీ కార్యాలయంలో కోరుట్ల, మెట్ పల్లి సర్కిల్ పోలీస్ అధికారులతో సోమవారం నిర్వ హించిన నెల వారి క్రైమ్ మీటింగ్ సమావేశంలో గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… దీర్ఘకాలంగా పెండిం గులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని అన్నారు .ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు. దొంగ తనాలు జరగకుండా రాత్రి పూట గస్తి బీట్‌లు, పెట్రోలింగ్‌ నిర్వహించాలని 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలాని అన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు పై నిఘా ఉంచాలి…

జిల్లాలా, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాల న్నారు. అక్రమ కార్యకలాపాలు అయిన మట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, పిడిఎస్ రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి..

వచ్చె నెల 7 వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఎస్.ఐ లు, ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించా లన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మండపాల్లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ఉమ మహేశ్వర రావు, సిఐలు నిరంజన్ రెడ్డి , సురేష్, డిసిఆర్బీ ,సీసీఎస్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్ , లక్ష్మి నారాయణ, ఎస్ఐలు చిరంజీవి, అనిల్, కిరణ్ కుమార్,రాజు, శ్రీకాంత్, శ్వేత,నవీన్, గీత,డిసిఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వినూత్న ప్రచారం

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Rr News Telangana

రత్నాకర్ రావు వర్ధంతి సభలో కర్ణాటక మంత్రి బోసురాజు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group