Rr News Telangana
జగిత్యాలమెట్ పల్లి

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

  •  ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
  • జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రతినిధి, ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) ఆగస్టు 26 :

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని దుబ్బవాడలో సోమవారం ఏర్పాటు చేసన కార్యక్రమంలో 40 సీసీ కెమెరాలను స్థానిక ప్రజలతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని,నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. పట్టణ, మండల, అన్ని గ్రామాల ప్రజలు, వ్యాపారులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకో వడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుం దన్నారు. మెట్ పల్లిలో ఈ మధ్యకాలంలో రెండు సంవత్స రాల బాలుడు కిడ్నాప్ కేసును సీసీ కెమెరాల ద్వారా గుర్తించి 16 గంటల్లోనే చేదించడం జరిగిందని అన్నారు.సిసి కెమెరాల ద్వారా సేకరించిన సాక్ష్యాల ద్వారా నేరస్థుడు పాల్పడిన నేరాన్ని కోర్టు నిరూపించ వచ్చని అన్నారు. సీసీ కెమెరాలను ప్రధాన రోడ్డు మార్గాల్లో ఎర్పాటు చేయడం ద్వారా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తగు సమీక్షా జరిపి రోడ్డు ప్రమాదాల నివాణకు తగిన జాగ్రత్త లో తీసుకోవచ్చు అన్నారు. జిల్లా ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు లో ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కృషి చేసిన స్థానిక ప్రజలను అభినందించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉమ మహేశ్వర రావు, మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ లు చిరంజీవి ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేరాల నియంత్రణ కోసమే సీసీ కెమెరాలు

Rr News Telangana

తాళం వేసిన ఇంట్లో బారి చోరీ

Rr News Telangana

మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాలలో ట్రాఫిక్ ఆంక్షలు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group