ఇబ్రహీంపట్నం, ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) ఆగస్టు 25 :
తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన లక్కం గంగ లక్ష్మి, చిన్న కొడుకు లక్కం రాకేష్ (16) ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతు న్నాడు. రాకేష్ కాలేజీకి సరిగా వెళ్లడం లేదని, తన స్నేహితులతో కలసి చెడు తిరుగుల్లు తిరుగుతున్నాడని తల్లి గంగ లక్ష్మి మందలించింది. దీనితో రాకేష్ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా అది గమనించిన తల్లి చికిత్స నిమిత్తం రాకేష్ ను మెట్ పల్లి పట్టణంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు.కాగా రాకేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం నిజామాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో రాకేష్ మృతి చెందాడు. రాకేష్ తల్లి లక్కం గంగ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు.