Rr News Telangana
జగిత్యాల

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

  • కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనించాలి
  • జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

 జగిత్యాల,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఇది అత్యంత అమానుష చర్యని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్ష్యం కాదని,ర్యాగింగ్ చేయడం నేరమని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసు కోవడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనేది లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించాలని సూచించారు. ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుకుంటే వారి బంగారు భవిష్యత్తును కోల్పోతారని, వ్యసనాలకు బానిసై విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. సరదాలకు వెళ్ళి కష్టాలను కొని తెచ్చుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సీనియర్లు ఆదేశించి నప్పటికీ, ఫ్రెషర్లు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడం మానుకోవాలి, విద్య సంస్థల యజమానులకు పిర్యాదు చేయాలని అన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలవద్దని కోరారు. ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి పోలీసు సహాయం పొందవచ్చునని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభ మైందని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులు నిర్వహించాలని, యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించడం జరిగిందని, యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనించాలని కోరారు.

Related posts

మెట్ పల్లి 12వ వార్డ్ అభివృద్ధి పనులకు 50 లక్షలు మంజూరు

Rr News Telangana

బీసీ కులగణన తీర్మానం బీసీలకు ఒక వరం

Rr News Telangana

138వ మేడేను జయప్రదం చేయండి

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group