జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం అడిషనల్ ఎస్పీ భీమ్ రావు ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ… తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయుడు, తెలంగాణ స్పూర్తి ప్రదాత అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శశికళ ,ఆర్ఐ లు రామకృష్ణ, వేణు, ఆర్.ఎస్ఐ లు,డిపివో ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.